News March 4, 2025

మార్చి 8న మహిళా దినోత్సవం వేడుకలు: కలెక్టర్

image

మ‌హిళా శ‌క్తిని, యుక్తిని చాటి చెప్పేలా మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లా స్థాయిలో నిర్వ‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల స‌న్న‌ద్ధ‌తపై చ‌ర్చించేందుకు క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. 

Similar News

News September 18, 2025

రేపు మంచిర్యాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా

image

మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య ఈరోజు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల నుంచి మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన 172 మంది ఉపాధ్యాయులు తమ ఎగ్జిబిట్స్‌తో హాజరు కానున్నారని పేర్కొన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు.

News September 18, 2025

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ డివైజులతో వేలిముద్ర సేకరించారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్ సేఫ్టీ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని, డయల్ 100కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.

News September 18, 2025

మంథని: అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ

image

అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ అధికారుల బృందం విచారణ మొదలైంది. గురువారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వామనరావు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వారి వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో మంథని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.