News November 19, 2025
మార్నింగ్ ఫాగ్: నగరంలో హెల్మెట్, జాకెట్ ఇక పక్కా

శీతాకాలం తీవ్రత నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారులపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. వాహనదారులు లో-బీమ్ లైట్లు ఉపయోగించడం, సురక్షిత దూరం పాటించడం, ఓవర్‌టేక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైకర్లు హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు.
Similar News
News December 14, 2025
కొండ చుట్టూ లోల్లులే!

ఒక లొల్లి పోగానే మరో లోల్లితో మంత్రి కొండా సురేఖ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నటుడు నాగార్జునతో గొడవ ముగిసిన తరుణంలో, KTR పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. DCC అధ్యక్షుల నియామక విషయంలో ఇంట్లోనే భేదాభిప్రాయాలతో వరంగల్‌కు దూరంగా ఉంటుండగా, ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ రూపంలో మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. నమ్మిన రమేశ్ వైరి వర్గంలోకి మారడం, తోటి మంత్రులతో విభేదాలూ చర్చనీయాంశమయ్యాయి.
News December 14, 2025
WNP: సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలపండి: ఎస్పీ

వనపర్తి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి అలసత్వం లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 14, 2025
నెల్లూరులో ఫ్రెండ్‌నే మోసం చేశాడు..!

ఫ్రెండ్‌నే మోసం చేసిన ఘటన ఇది. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన షేక్ అమీర్ అహ్మద్, కోటమిట్టకు చెందిన ఎండీ అర్షద్ అహ్మద్ స్నేహితులు. బంగారం వ్యాపారం చేసే అర్షద్.. ఈ బిజినెస్‌లో పెట్టుబడితే బాగా లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో అర్షద్‌కు అమీర్ రూ.3.55 కోట్లు ఇచ్చాడు. లాభాలు చూపకపోగా నెల్లూరు నుంచి అర్షద్ అదృశ్యమయ్యాడు. మోసపోయానని గ్రహించిన అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


