News December 21, 2025
“మార్పు” కార్యక్రమం పటిష్ఠంగా అమలు చేయండి: కలెక్టర్

నాటుసారా తయారీదారులు ఆ పని నుంచి బయటకు తీసుకువచ్చి, ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఉద్దేశించిన “మార్పు” కార్యక్రమం మరింత పటిష్ఠంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. ఏలూరు జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా రూపొందించినందుకు అధికారుల కృషి అభినందనీయమన్నారు.
Similar News
News December 22, 2025
నిద్ర పట్టట్లేదా? మీ సమస్య ఇదే కావొచ్చు!

నిద్రలేమి సమస్యలకు కెఫిన్ కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 10-20% దీర్ఘకాలిక నిద్ర సమస్యలొస్తున్నట్లు చెబుతున్నారు. ‘కెఫిన్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం లేకపోతే నిద్రపట్టదు. అలాంటివారు పడుకోడానికి 6-8 గంటల ముందే కాఫీ, టీ, చాక్లెట్ వంటివి తీసుకోవద్దు. అయినా తగ్గకపోతే పూర్తిగా కెఫిన్ తీసుకోవడం మానేయాలి. కొన్నిరోజుల్లో మార్పు కనిపిస్తుంది’ అని తెలిపారు.
SHARE IT
News December 22, 2025
MBNR: నేటి నుంచి క్రికెట్ పండుగ.. జట్లు ఇవే!

మహబూబ్ నగర్‌లోని ఎండీసీఏ మైదానంలో (పిల్లలమర్రి) జి.వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా “టీ-20 క్రికెట్ లీగ్” నేటి నుంచి ప్రారంభమవుతుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ లీగ్ లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జట్లు పాల్గొంటాయని ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడుతాయన్నారు.
SHARE IT.
News December 22, 2025
ధనుర్మాసం: ఏడోరోజు కీర్తన

‘ఓ పిల్లా! పక్షుల కిలకిలారావాలు వినబడటం లేదా? గోపికలు చేతి గాజుల సవ్వడితో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులు నీ చెవిన పడలేదా? మన కష్టాలను తీర్చడానికి కృష్ణుడు కేశి వంటి రాక్షసులను సంహరించాడు. మేమంతా ఆ పరమాత్మ గుణగానం చేస్తూ నీ ఇంటి ముందు ఉన్నాము. వింటున్నావు కానీ ఇంకా నిద్ర వదలడం లేదు. ఇకనైనా మేల్కొని మాతో కలిసి వ్రతానికి సిద్ధం కావమ్మా!’ అంటూ ఆండాళ్ గోపికను వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>


