News December 24, 2025
మాల్యా భారత్‌కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్‌కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
Similar News
News December 25, 2025
నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి.
News December 25, 2025
ధనుర్మాసం: పదో రోజు కీర్తన

యోగనిద్రలో ఉన్న ఐదో గోపికను ఇతర గోపికలు ఇలా మేల్కొల్పుతున్నారు. ‘ఓ అమ్మా! తలుపు తీయకపోయినా పర్వాలేదు. కనీసం మా మాటలకు సమాధానమైనా ఇవ్వు. జ్ఞానుల మాటలు వినడం ఎంతో పుణ్యం. పరిమళభరిత తులసిమాలలు ధరించే నారాయణుడు మన వ్రతానికి ఫలితాన్నిస్తాడు. రాముడి చేతిలో హతుడైన కుంభకర్ణుడు తన నిద్రను నీకేమైనా ఇచ్చాడా? ఆలస్యం చేయక నిద్ర వీడి, మాతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయి’ అని వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 25, 2025
RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు జైపూర్ పోక్సో కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ సముచితం కాదని పేర్కొంది. క్రికెట్‌లో సలహాలిస్తానంటూ హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు దయాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే ఆస్కారముంది.


