News September 20, 2025
మావోయిస్టు నేత జగన్ సంచలన లేఖ

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ఓ సంచలన లేఖను విడుదల చేశారు. మావోయిస్టు నేత సోను ఇటీవల ఆయుధాలు వీడుతామంటూ రాసిన లేఖ అనాలోచితమని, ఈ లేఖతో ఉద్యమం బలహీనపడుతుందని జగన్ పేర్కొన్నారు. ముఖ్య నాయకులతో చర్చించకుండానే సోను ఈ లేఖ రాశారని వెల్లడించారు. ఇటీవల సోను కేంద్ర ప్రభుత్వానికి, మీడియాకు లేఖ రాస్తూ చర్చలకు, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News September 20, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: TTD

AP: 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు TTD EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందిలేకుండా సూక్ష్మ-క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉ.8-10 గం. వరకు, రా.7-రా.9 గం. వరకు వాహన సేవలు. సా.6.30- రాత్రి 12 గంటల వరకు గరుడసేవ ఉంటుందన్నారు. ధ్వజారోహణం(SEP 24) రోజు CM చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
News September 20, 2025
వరంగల్ మార్కెట్ రెండు రోజులు బంద్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
News September 20, 2025
నిర్మల్: 22 నుంచి టాస్ పరీక్షలు

ఈనెల 22 నుంచి 28 వరకు టాస్ పదో, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్మల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరత్ పేట్‌లో పరీక్ష కేంద్రం కలదని, ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల ఈదిగాంలో పరీక్షా కేంద్రం ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయన్నారు.