News November 23, 2025
మావోయిస్టు పార్టీలో మిగిలిన తెలంగాణ వాసులు వీరే..!

వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీ దాదాపు వెంటిలేటర్ పైకి చేరింది. ఇప్పుడు ఆ పార్టీ మనుగడకు తెలంగాణకు చెందిన లీడర్లే పెద్ద దిక్కుగా మారారు. తెలంగాణ DGP శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర కమిటీలో ముప్పాల లక్ష్మణ్ రావు@గణపతి, మల్ల రాజిరెడ్డి @సంగ్రామ్, తిప్పిరి తిరుపతి@దేవ్ జీ, గణేష్, బడే చొక్కారావు@దామోదర్ ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 10 మంది, అజ్ఞాతంలో 59 మంది కొనసాగుతున్నారు.
Similar News
News November 24, 2025
అన్ని రికార్డుల్లోనూ జిల్లా పేరు మార్పు: జేసీ

అన్ని ప్రభుత్వ పత్రాల్లో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ పేరును చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖలో ఈ మార్పు జరిగిందని, మిగిలిన శాఖల్లోనూ పూర్తిస్థాయిలో పేరు మారేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పడుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.
News November 24, 2025
ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్‌డమ్ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


