News January 26, 2026

మావోల గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు

image

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47 మారుమూల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లు, బ్యాంకులు, పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.

Similar News

News February 15, 2026

ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

image

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.

News February 15, 2026

నమీబియాపై USA గెలుపు

image

T20WC: చెన్నైలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో USA 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్‌రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

News February 15, 2026

ఛావా, పుష్ప-2 రికార్డులు బ్రేక్

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోనూ ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్(59 రోజులు) ఇండియన్ ఫిల్మ్‌గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విక్కీ కౌశల్ ‘ఛావా’(58 D) రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో స్త్రీ-2(57 D), ప్రేమలు, పుష్ప-2(53 D), మంజుమ్మల్ బాయ్స్(50 D) ఉన్నాయి.