News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
Similar News
News March 16, 2025
అచ్చంపేట: ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందికి వస్తున్న ఆటో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అమ్రాబాద్ మండలం తెలుగుపల్లికి చెందిన తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయని అచ్చంపేట పోలీసులు తెలిపారు. ఓ పెళ్లి వేడుక నిమిత్తం కొండపైకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందని అన్నారు. గాయాలైన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
News March 16, 2025
నెల్లూరు: రైతును చెరువులో తోసి నగదుతో పరార్

తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరిడీ కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి 25 వేల రూపాయలను రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.
News March 16, 2025
నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు.