News January 6, 2025
మా ఊరిని టాప్ వన్‌గా మారుస్తా: కర్నూలు MP
తన సొంత గ్రామం పంచలింగాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే టాప్ వన్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు పరిధిలోని పంచలింగాల ఎస్సీ కాలనీలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే పంచలింగాల రూపు రేఖలు మారబోతున్నాయని ఎంపీ అన్నారు.
Similar News
News January 7, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో ఈనెల 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 7, 2025
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయక్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్ అయ్యారు. కోర్టు స్టే ఉన్న ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ దర్యాప్తు జరిపారు. వాస్తవాలు గుర్తించి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉన్నంత వరకూ హెడ్ క్వార్టర్స్ వదిలి బయటికి వెళ్లరాదని ఆదేశించారు.
News January 7, 2025
నంద్యాల: ప్రియుడి మోజులో కుమార్తెను వదిలేసిన తల్లి!
ప్రియుడి మోజులో ఓ తల్లి కుమార్తెనే వదిలేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తాజాగా బాపులపాడు మండలంలో సంచరిస్తున్న బాలికను పోలీసులు వివరాలు ఆరా తీయగా తల్లి వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. బాలికను నంద్యాల పోలీసులకు అప్పగించారు.