News July 26, 2024
మా మీద కోపం రైతుల మీద చూపించకండి: కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసిఆర్, కేటీఆర్, మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్ప.. రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. కాళేశ్వరంలోని లక్ష్మి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని.. లేనట్లయితే రైతులతో కలిసివచ్చి మేమే ఆన్ చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ బుగ్గారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఒకేరోజు ముగ్గురి మృతి.
@ కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వాసుపత్రులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.
@ జగిత్యాల రూరల్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం.
@ మేడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు.
@ తంగళ్లపల్లి మండలంలో కారును ఢీకొన్న లారీ.
News November 27, 2024
సంక్షేమ హాస్టళ్లకు సన్న రకం బియ్యం అందిస్తాం: మంత్రి ఉత్తమ్
సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. KNR జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న రకాల వడ్ల కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.
News November 27, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.