News January 6, 2026
మిక్స్డ్ టైప్ స్కిన్‌కు ఈ ఫేస్ ప్యాక్

కొన్నిసార్లు జిడ్డుగా, మరొకసారి పొడిబారినట్లుండే చర్మతత్వం కొందరిలో కనిపిస్తుంది. దీన్నే మిక్స్డ్ టైప్ స్కిన్ అంటారు. ఇలాంటి తత్వం ఉన్నప్పుడు చర్మం డల్‌గా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక గుడ్డు తెల్లసొనకు తేనె, చెంచా నారింజ రసం, పావుచెంచా పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ముఖ చర్మమంతా ఒకేలా మెరుపులీనుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయడం మంచిది.
Similar News
News February 4, 2026
ప్రాజెక్టులకు రూ.18వేల కోట్లు బకాయి పెట్టారు: రామానాయుడు

AP: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.18వేల కోట్లు బకాయి పెట్టిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. YCP విధ్వంసంతో ఇరిగేషన్ శాఖ గాడి తప్పిందన్నారు. పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఖరీఫ్ ముగిసినా రిజర్వాయర్లలో నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్‌మెంట్ వల్లే అని పేర్కొన్నారు.
News February 4, 2026
IND vs SA.. లైవ్ ఇక్కడ చూడండి

T20WC వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాపై టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన ఇరు జట్లు మళ్లీ ఈ టోర్నీలో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంటున్నాయి. 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
IND: అభిషేక్, ఇషాన్, సూర్యకుమార్(C), తిలక్, శాంసన్, పాండ్య, రింకూ, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.
News February 4, 2026
CUET UG.. మరికొన్ని గంటలే ఛాన్స్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG-2026) రిజిస్ట్రేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. రా.11.50 వరకు <


