News January 5, 2026
మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.
Similar News
News February 9, 2026
పాక్ గొంతెమ్మ కోర్కెలు.. కుదరదన్న ICC!

T20WC: ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICCకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ‘భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, IND-PAK-BAN మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలి’ అని కోరినట్లు సమాచారం. పాక్ గొంతెమ్మ కోర్కెలను ICC తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘అది మా పరిధి కాదు’ అని ICC సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
News February 9, 2026
కోలుకుంటున్న శరద్ పవార్

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
News February 9, 2026
‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.


