News March 1, 2026

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. వార్ జోన్‌లో 80లక్షల మంది భారతీయులు!

image

US, ఇజ్రాయెల్‌ – ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్న దేశాల్లో దాదాపు 80లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈలో 35.5లక్షలు, సౌదీ అరేబియాలో 24.6లక్షలు, ఖతార్‌లో 8.4లక్షలు, కువైట్‌లో 9.9 లక్షలు, జోర్డన్‌లో దాదాపు 17వేలు, ఇజ్రాయెల్‌లో 20వేలు, ఇరాన్‌‌లో 10వేల మంది భారతీయులు ఉన్నారు. కాగా భారత విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

Similar News

News March 1, 2026

2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

image

AP: కూటమి ప్రభుత్వం బెదిరింపులకు YCP భయపడదని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ‘అంబటి ఎప్పుడూ ఎవరినీ దూషించలేదు. TDP నేతలు కావాలనే ఆయన్ను రెచ్చగొట్టారు. రాంబాబు క్షమాపణలు చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేశారు. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి YCP భయపడదు. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేశ్‌కే ఇబ్బంది’ అని హెచ్చరించారు.

News March 1, 2026

సంజూ హాఫ్ సెంచరీ

image

T20WC: కీలక మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.

News March 1, 2026

ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం.. ట్రంప్ ప్రకటన

image

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను అంతమొందించామని వెల్లడించారు. US-ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే సైనిక ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.