News February 28, 2026

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారతీయులకు అలర్ట్

image

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, ఇరాన్, UAE, జోర్డాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దని చెప్పింది. ఎప్పటికప్పుడు వార్ న్యూస్ తెలుసుకుంటూ అవగాహనతో ఉండాలని తెలిపింది. అత్యవసర సహాయానికి తమ దేశంలోని ఎంబసీలను సంప్రదించాలని పేర్కొంది.

Similar News

News March 3, 2026

కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

image

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్‌ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్‌కు యురేనియమ్‌ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.

News March 3, 2026

ఖమేనీ మృతిపై నిరసనలు.. చాహల్ పోస్ట్

image

దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమ్ఇండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్‌తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటో తన X అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు యాంకర్ రష్మీ సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేశారు.

News March 3, 2026

వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్ ధరల హైక్ ఇప్పట్లో లేనట్లే!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరల ఎఫెక్ట్ దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలపై ఉంటుందనే ఆందోళన మొదలైంది. అయితే ఇప్పట్లో ఇంధన ధరల పెరుగుదల ఉండదని సమాచారం. ఇప్పటివరకు ఇంధన సంస్థలు చమురు ధరలు పెరిగినప్పుడు భారం భరించి, తగ్గినప్పుడు రికవర్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా కేంద్రం ఇదే పాలసీని కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. చివరగా 2022 ఏప్రిల్‌లో ధరలు పెరిగాయి.