News March 1, 2026
మిడిల్ ఈస్ట్ దేశాలు.. వాటి ప్రాముఖ్యం ఇదే!

మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియా, Iran, ఈజిప్ట్, తుర్కియే, Iraq, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, లెబనాన్, Yemen, ఒమన్, UAE, కువైట్, బహ్రెయిన్, ఖతర్, పాలస్తీనా, సైప్రస్ దేశాలున్నాయి. ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాల జన్మస్థలాలు, పురాతన నాగరికతలు (మెసొపొటేమియా, ఈజిప్టు) ఇక్కడే పుట్టాయి. ప్రపంచంలోని ఆయిల్&నేచురల్ గ్యాస్ నిల్వలలో అతిపెద్ద భాగం(48-50%) ఇక్కడే ఉన్నాయి. అలాగే వాణిజ్య గేట్‌వేగా పిలువబడుతున్నాయి.
Similar News
News March 1, 2026
2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

AP: కూటమి ప్రభుత్వం బెదిరింపులకు YCP భయపడదని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ‘అంబటి ఎప్పుడూ ఎవరినీ దూషించలేదు. TDP నేతలు కావాలనే ఆయన్ను రెచ్చగొట్టారు. రాంబాబు క్షమాపణలు చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేశారు. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి YCP భయపడదు. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేశ్‌కే ఇబ్బంది’ అని హెచ్చరించారు.
News March 1, 2026
సంజూ హాఫ్ సెంచరీ

T20WC: కీలక మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.
News March 1, 2026
ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం.. ట్రంప్ ప్రకటన

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను అంతమొందించామని వెల్లడించారు. US-ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే సైనిక ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.


