News April 14, 2025
మిడ్జిల్: తండ్రి, కొడుకుల అదృశ్యం

మిడ్జిల్ మండలానికి చెందిన తండ్రి, కొడుకులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకు రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
Similar News
News April 15, 2025
మహబూబ్నగర్: కలెక్టర్ కదా కారులో.. వస్తారనుకున్నారా..!

తాము చేపట్టే పనుల్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కారులో వస్తారని అనుకున్న అధికారులకు కాలినడకన వచ్చి అధికారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి.. మండల పరిధిలోని తుమ్మలకుంట వంటి గుడిసే తండా, చిన్న గుట్ట తండా, తుమ్మలకుంట, వల్లూర్ గ్రామాల్లో చేపడుతున్న పునరావాస పనుల్ని మంగళవారం కలెక్టర్ విజయేంద్ర బోయి ఎండను సైతం లెక్కచేయకుండా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లి పరిశీలించారు.
News April 15, 2025
మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.
News April 15, 2025
BREAKING.. నాగర్కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.