News October 30, 2025

మిడ్ మానేరులో 5 గేట్లు ఎత్తివేత

image

సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి మిడ్ మానేరు జలాశయంలో నీటిమట్టం 317.80 మీటర్లకు చేరింది. మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలలో 27.04 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 13,175 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటి ప్రవాహం నియంత్రణ కోసం 5 గేట్లు ఎత్తివేయగా, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 30, 2025

మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

image

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.

News October 30, 2025

నిజామాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్(48) తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 30, 2025

కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

image

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.