News February 4, 2025

మిథిలాపురి: ఉరి వేసుకొని వ్యక్తి సూసైడ్

image

విశాఖలోని మిథిలాపురిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.

Similar News

News February 18, 2026

విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

image

విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, 71 యుద్ధ నౌకల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.

News February 18, 2026

ప్లీట్ రివ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దంపతులు

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని వారు కలిశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు, నౌకదళ అధిపతులు, విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. యుద్ధనౌకల సామర్థ్యం వివరిస్తూ ఫీట్ రివ్యూ కొనసాగుతోంది.

News February 18, 2026

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాధవ్

image

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రీయ RSS సభ్యులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక జాతీయవాద సంస్థ అని అన్నారు. అటువంటి సంస్థ సభ్యులపై దాడికి పాల్పడడం అంటే కమ్యూనిస్టులు అరాచకత్వానికి పరాకాష్టగా అని అన్నారు.