News February 19, 2026

మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>మిధాని<<>> ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌ 6 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి MBBS, BSc(నర్సింగ్, MLT), GNM, బీఫార్మసీ, డీఫార్మసీ, DMLT, BCom, BCA అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5, 6, 7, 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ట్రేడ్/ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://midhani-india.in

Similar News

News February 20, 2026

4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

image

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్‌లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.

News February 20, 2026

ప్రాంప్ట్ ఇస్తే చాలు.. సినిమా రెడీ: హాలీవుడ్‌ను వణికిస్తున్న చైనా యాప్

image

చైనాకు చెందిన బైట్‌డాన్స్ విడుదల చేసిన ‘Seedance 2.0’ అనే కొత్త AI యాప్ హాలీవుడ్‌ను వణికిస్తోంది. కేవలం కొన్ని ప్రాంప్ట్‌లతో ఇది సినిమా క్వాలిటీ వీడియోలను, సౌండ్ ఎఫెక్ట్స్, డైలాగ్‌లతో సహా సృష్టించగలుగుతోంది. స్పైడర్ మ్యాన్, డెడ్‌పూల్ వంటి పాపులర్ క్యారెక్టర్లతో ఈ యాప్ సృష్టించిన వీడియోలు వైరలవ్వడంతో.. డిస్నీ, పారామౌంట్ వంటి స్టూడియోలు కాపీరైట్ ఉల్లంఘన అంటూ బైట్‌డాన్స్‌పై మండిపడుతున్నాయి.

News February 20, 2026

హెరిటేజ్‌పై సభలో చర్చ పెట్టాల్సిందే: బొత్స

image

AP: హెరిటేజ్-ఇందాపూర్ <<19189089>>డెయిరీపై<<>> సభలో చర్చ పెట్టాల్సిందేనని YCP MLC బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దేవుడి సొమ్మును లూటీ చేస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ ప్రైవేటు సంస్థ అని, దాని గురించి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామి ఫొటోలు, బ్యానర్లతో YCP MLCలు మండలికి ర్యాలీగా వెళ్లారు. ‘కల్తీ నెయ్యి’ వ్యవహారంపై హిందూ సమాజానికి CM చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు.