News December 12, 2025
మినిస్టర్-ఇన్-వైటింగ్‌గా మంత్రి సీతక్క

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి సీతక్కను రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మినిస్టర్-ఇన్-వైటింగ్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించినట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 14, 2025
యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కు ఇలా చెక్

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్‌కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్‌ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth
News December 14, 2025
మెట్‌పల్లి: లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదువు.. నేడు ఉప సర్పంచ్

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి వార్డు మెంబర్‌గా పోటీ చేసి విజయం సాధించిన ఆకుల రాకేష్ (30)కు ఉప సర్పంచ్ పదవి వరించింది. లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదివిన రాకేష్ స్వగ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ఉప సర్పంచ్ పదవిని అలంకరించారు.
News December 14, 2025
NGKL: 23.06 శాతం పోలింగ్ నమోదు.

రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9:00 సమయానికి 23.06 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. 100% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఓటర్లు తెలుపుతున్నారు. ఓటు వినియోగించుకునేందుకు యువత మరియు గ్రామస్తులు తరలివస్తున్నారు.


