News March 21, 2025
మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్

నెలాఖరులోపు మినీ గోకులాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి వివరించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఫార్మ్ ఫండ్ ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి, గోకులంల నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1200 లక్ష్యానికి 664 పూర్తి చేసామని కలెక్టర్ వివరించారు.
Similar News
News February 21, 2026
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఎస్ఎస్వీ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఒక కాలనీలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి చిన్నారి మృతిచెందింది. బోయరేవుల శ్రీదేవి-గోపాల్ దంపతుల కుమార్తె విజయలక్ష్మి(5) ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం వలస వెళ్లగా చిన్నారి అవ్వతాతల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి నీటి తొట్టిలో పడి మరణించింది.
News February 21, 2026
కర్నూలు: ‘పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసేయాలి’

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News February 21, 2026
జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి టీజీ భరత్

తిరుమల అంశంపై మాజీ సీఎం జగన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని మంత్రి TG భరత్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూజలు, మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. నెయ్యి కల్తీ వాస్తవమని, వైసీపీ నేతలు కౌన్సిల్‌లో చెప్పులు వేసుకుని స్వామి ఫొటోలు ప్రదర్శించడం బాధాకరమన్నారు. నిజాలు కప్పిపుచ్చేందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని విమర్శించారు.


