News February 9, 2025
మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.
Similar News
News November 5, 2025
విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 5, 2025
‘గచ్చిబౌలి దివాకర్’లా నారా లోకేశ్: YCP

AP: మంత్రి లోకేశ్‌పై YCP సెటైర్లు వేసింది. ‘4 గంటల్లో 4 వేల మంది అర్జీలు వినగలమా? గంటకు వెయ్యి అర్జీలేంటో తెలుసుకోవడం సాధ్యమేనా? మరీ ఇంత జాకీలా? మహా అయితే గంటకు 40 మందివి వినగలం. అలాంటిది లోకేశ్ 4 గంటల్లో 4 వేల మంది అర్జీలు తీసుకుని, విన్నట్టుగా ఈ ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్’ గుర్తుకువస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది.


