News December 26, 2025
మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారా?

మనల్ని చూసి అసూయపడే వాళ్లు చుట్టూ ఉంటారు. వారిని ఏ మాత్రం కాస్త నిర్లక్ష్యం చేసినా సరే పెద్ద సమస్యగా మారతారు. వీరికి చెక్ పెట్టాలంటేఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. చాలామంది భావోద్వేగాలు పెరిగి హర్ట్ అవుతారు. ఇది ప్రశాంతతను పాడు చేస్తుంది. ఎవరైనా అసూయతో మాట్లాడితే చాలా నెమ్మదిగా రెస్పాండ్ అవ్వండి. ఎమోషనల్ రియాక్ట్ అవడం వల్ల సమస్య పెద్దది అవుతుంది. మీ పనిపై శ్రద్ధ పెడితే ఇలాంటివి పెద్దగా బాధించవు.
Similar News
News January 2, 2026
ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News January 2, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 2, 2026
ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.


