News January 8, 2026

మిరప పంటకు తెగుళ్ల ముప్పు.. నివారణ ఎలా?

image

చలి తీవ్రత కారణంగా మిరప పంటలో తెగుళ్ల ముప్పు పెరిగింది. ముఖ్యంగా నల్లతామర పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా మొక్కల ఆకులు, కాయలు రాలి, పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతున్నాయి. నల్ల తామర పురుగులతో పాటు బూడిద తెగులు, పూత, కాయతొలుచు పురుగుల ఉద్ధృతి కూడా పెరిగింది. వీటి నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

Similar News

News February 15, 2026

భారత్ 15 ఓవర్లు కూడా ఆడలేదు.. ఇమాద్ ఓవరాక్షన్!

image

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు దాయాది మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. శ్రీలంక పరిస్థితుల్లో టీమ్‌ఇండియా 15 ఓవర్లు కూడా నిలబడలేదని, అక్కడ భారత్‌లో లాగా చిన్న బౌండరీలు ఉండవంటూ తన నోటి దురుసును బయట పెట్టుకున్నారు. పాక్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు తేలిపోతారని, దూకుడుగా ఆడాలని చూస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో గట్టిగానే కౌంటరిస్తున్నారు.

News February 15, 2026

కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం రీఓపెన్ ఎప్పుడంటే?

image

12 జ్యోతిర్లింగాలలో ఒకటి, చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ రీఓపెన్ తేదీని ఆ రాష్ట్ర CM పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి శివుడిని దర్శించుకోవచ్చని చెప్పారు. అందుకు తగ్గట్లు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విపరీతమైన మంచు వల్ల ఆలయాన్ని గతేడాది అక్టోబర్ 23న మూసేశారు. కేదార్‌నాథ్ టెంపుల్ సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

News February 15, 2026

సమ్మర్ ఎంటర్.. ఏసీలు సర్వీసింగ్ చేయిస్తున్నారా?

image

తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం దాదాపు ముగిసిపోయి సమ్మర్ ఎంటరైంది. దీంతో ఏసీల వాడకానికి టైమ్ వచ్చేసింది. అయితే ముందుగా వాటిని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కూలింగ్ సరిగా ఇవ్వకపోగా పవర్ బిల్ షాక్ ఇస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయడం, గ్యాస్ లీక్‌లను టెక్నీషియన్లతో చెక్ చేయించాలని సూచిస్తున్నారు. ఏటా రెండు సార్లైనా సర్వీసింగ్ చేయించాలంటున్నారు.