News December 25, 2025
మిరప పంటలో బూడిద తెగులు – నివారణ

మిరప పంటలో బూడిద తెగులు ఎక్కువగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో వస్తుంది. పొడి లాంటి తెల్లటి మచ్చలు ఆకుల కింది భాగంలో కనబడతాయి. ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా రంగుమారిన ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు Mycobutanil అనే మందు 1.5 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా azoxystrbin Tebucinazole 1.5ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Similar News
News December 30, 2025
నిమ్మ తోటల్లో అంతర పంటలతో అధిక ఆదాయం

నిమ్మ తోటల్లో తొలి ఐదేళ్లు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. అంతర పంటలతో కలుపు ఉద్ధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ, పెసర, మినుము, చిక్కుడు, బీన్స్, బంతి, దోస, పుచ్చ, బీర, కాకర, ఉల్లిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. టమాటా, మిరప, వంగ, బెండ, పొగాకు లాంటి పంటలు అంతర పంటలుగా వేస్తే నులు పురుగులు వచ్చే అవకాశం ఉంది కావున వాటిని అంతర పంటలుగా వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 30, 2025
నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్‌నెస్‌లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్‌కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు. గత 45 ఏళ్లుగా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ కాలేదని పేర్కొన్నారు. పాజిటివ్ థింకింగ్, మెంటల్ హెల్త్ కూడా కీలకమని చెప్పారు. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు.
News December 30, 2025
సంక్రాంతికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.


