News December 15, 2025
మిరుదొడ్డి: ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా..

కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
Similar News
News December 19, 2025
CNAP సర్వీస్ లాంచ్ చేసిన జియో

CNAP (కాలర్ నేమ్ ప్రజెంటేషన్) సర్వీస్‌ను జియో స్టార్ట్ చేసింది. కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా మొబైల్ స్క్రీన్‌పై సిమ్ కార్డుతో రిజిస్టర్ అయిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. సిమ్ కొనుగోలు చేసే సమయంలో ఇచ్చిన కేవైసీ డాక్యుమెంట్‌లో ఉన్న పేరు కనిపించేలా రూపొందించింది. స్పామ్, మోసపూరిత, డిజిటల్ స్కామ్‌లను నియంత్రణకు ఉపయోగపడే ఈ సర్వీస్ ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
News December 19, 2025
TU: సౌత్ క్యాంపస్‌ను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

భిక్కనూరు మండల పరిధిలోని టీయూ సౌత్ క్యాంపస్‌ను శుక్రవారం జిల్లా డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డా.శిరీష తనిఖీ చేశారు. బాలుర వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనాలను మోతాదుకు అనుగుణంగా ఉపయోగించాలన్నారు. నాణ్యమైన సరుకులు వాడాలని, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని వార్డెన్ డా.యాలాద్రికి సూచించారు. క్యాంపస్‌లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News December 19, 2025
నరసరావుపేట: EVM గోడౌన్ భద్రతను పర్యవేక్షించిన కలెక్టర్

నరసరావుపేట స్థానిక మార్కెట్ యార్డులోని EVM గోడౌన్‌లను కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. EVM, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సెక్యూరిటీ లాగ్ బుక్‌ను తనిఖీ చేశారు. గోడౌన్ల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పటిష్ఠమైన భద్రత కొనసాగించాలని ఆమె అధికారులను ఆదేశించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


