News December 15, 2025

మిరుదొడ్డి: గొర్రెల కాపరి నుంచి ఉపసర్పంచిగా..

image

సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం ఇది. రెండో విడత స్థానిక ఎన్నికల్లో గొర్రెల కాపరిగా జీవనం సాగించిన పెద్ద కురుమ కరుణాకర్ మిరుదొడ్డి మేజర్ గ్రామపంచాయతీకి ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 7వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండి, సేవ చేస్తానని భరోసా ఇచ్చారు. సాధారణ నేపథ్యం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కరుణాకర్ ప్రశంసలు అందుకుంటున్నారు.

Similar News

News December 16, 2025

ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

image

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <>క్లిక్ చేయండి.<<>>

News December 16, 2025

ADB: మూడో విడత ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఐదు మండలాల్లోని 151 జీపీలలో గల 204 పోలింగ్ కేంద్రాల వద్ద 938 మంది సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. ఇప్పటికే 756 మందిని బైండోవర్ చేశామని, అక్రమ మద్యం రవాణా జరగకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.

News December 16, 2025

ముస్తాబాద్: 730 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆఖరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.