News December 3, 2025

మిర్యాలగూడలో అత్యధికం.. అడవిదేవులపల్లిలో అత్యల్పం..!

image

మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. ​మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 360 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, అతి తక్కువగా అడవిదేవులపల్లి మండలంలో కేవలం 101 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Similar News

News December 3, 2025

దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

image

దేవరకొండ, గాంధీనగర్‌లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.

News December 3, 2025

ఎన్ని నామినేషన్లు వచ్చాయి?ఎన్ని రిజక్ట్ చేశారు?: ఇలా త్రిపాఠి

image

నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ? ఎన్ని రిజక్ట్ చేశారని? అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్‌పై ఆరా తీశారు.

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.