News April 25, 2025
మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం

మిర్యాలగూడ – సాగర్ రోడ్డులో ఉన్న న్యూ విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ వర్క్స్‌లో నిప్పు అంటుకొని భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
నిరాశ పరిచిన జూన్.. రైతన్నను వెంటాడుతున్న కష్టాలు

నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని.. మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు సంతోషించారు. జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయం మందగించిపోతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మోస్తరు వర్షాలే తప్ప.. భారీ వర్షం జాడ కానరావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News July 5, 2025
విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత: జాయింట్ అడ్వైజర్

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, తుపాన్లు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు జిల్లాలోనూ ఆపద మిత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News July 5, 2025
బాలసదనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో రూ.1.34 కోట్లతో నిర్మిస్తోన్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.