News September 23, 2025
మిర్యాలగూడలో భారీ చోరీ.. దొంగలు దొరికారు

మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్‌లో జరిగిన భారీ చోరీ కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.66.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు.
Similar News
News September 23, 2025
పెరవలిలో రోడ్డు ప్రమాదం

తూ.గో జిల్లా పెరవలి మండలం తీపర్రు పరిధిలో మంగళవారం RTC బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 23, 2025
మేడారం: PIC OF THE DAY

ములుగు జిల్లాలోని మేడారం పర్యటనలో భాగంగా సమ్మక్క, సారలమ్మ దేవతలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే సమయంలో సీఎం రేవంత్ పక్కన మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరు ఒకేసారి గంట కొడుతున్న దృశ్యం నేటి ఫొటో ఆఫ్ ద డేగా నిలిచింది. అనేక సందర్భాల్లో సీతక్క, సురేఖలను సమ్మక్క, సారక్కలుగా వర్ణించడం మనం వింటూనే ఉన్న విషయం తెలిసిందే.
News September 23, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అదే విధంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 53 మంది అధికారులకు వరద పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.