News September 28, 2024

మిర్యాలగూడలో రామ్‌నగర్ బన్నీ చిత్ర యూనిట్

image

బుల్లి తెర నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన రామ్ నగర్ బన్నీ టీం మిర్యాలగూడలో సందడి చేసింది. పట్టణంలో ఓ కళాశాలలో మూవీకి సంబంధించిన ప్రోమో జరిగింది. ప్రభాకర్‌తో పాటు హీరోహీరోయిన్లు హాజరయ్యారు. నేటి యువతను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఆదరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు.

Similar News

News February 6, 2026

నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి

image

నల్గొండ పట్టణాన్ని అన్ని హంగులతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. శుక్రవారం 4, 5 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కేశరాజుపల్లి నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. నల్గొండ భవిష్యత్తును అందరం కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

News February 6, 2026

NLG: జీరో ఎన్రోల్మెంట్ లోనూ నల్గొండ రికార్డు!

image

జీరో ఎన్రోల్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జీరో లేదా తక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు దేశవ్యాప్తంగా ఉన్న 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉండగా.. అందులో NLG జిల్లాలో 315 నిర్వహణ లేని పాఠశాలలున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో గత కొన్నేళ్లుగా సర్కార్ స్కూళ్లను చిన్నచూపు చూస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఆకర్షణ కూడా జీరో ఎన్రోల్మెంట్ మరో కారణం.

News February 6, 2026

NLG: కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అదిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. NLG మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా ఎంఆర్ వినోద్‌రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్ రెడ్డి, హాలియాకు నాగ సీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు.