News August 10, 2024
మిర్యాలగూడలో సినిమా షూటింగ్

మిర్యాలగూడ మండలం నందిపాడలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ను బీజేపీ నాయకులు మదన్మోహన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రచయిత, దర్శకులు అంజి అయాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శివాలయ నిర్మాణానికి వారాహి సంస్థ తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రవీంద్ర కుమార్, వీటి యాదవ్, భార్గవ్, గిరి, రవి శంకర్, చారి పాల్గొన్నారు.
Similar News
News February 20, 2026
NLG: హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి!

జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో దస్రూ నాయక్ తెలిపారు. పరీక్షల సరళిపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 27,905 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు.
News February 20, 2026
నల్గొండ: రైతులు ఖాతాల్లో ‘సన్నాల’ బోనస్ రూ.71.47 కోట్లు జమ

వానాకాలం సీజన్‌లో సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ నగదు విడుదల చేసింది. జిల్లాలోని 31,416 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్లను నేరుగా జమ చేసింది. ఇప్పటికే ధాన్యం విలువ కింద రూ.355.18 కోట్లు చెల్లించగా, తాజా బోనస్‌తో రైతులకు అదనపు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 19, 2026
NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.


