News January 14, 2026
మిర్యాలగూడ జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి!

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం ప్రకటనతో ఉమ్మడి నల్గొండలో చర్చ మొదలైంది. ప్రధానంగా మిర్యాలగూడను జిల్లాగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో లోక్‌సభ స్థానంగా ఉన్న ఈ ప్రాంతం.. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. సాగర్, హుజూర్‌నగర్, దేవరకొండ ప్రాంతాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంతో పాటు ఉపాధి పెరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
Similar News
News February 11, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 11, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 11, 2026
T20 WCలో ప్రపంచ రికార్డు

UAEతో మ్యాచులో ఊచకోత కోసిన న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్, అలెన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తొలి వికెట్‌కు 175* పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం జోడించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ పార్ట్‌నర్ షిప్ కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో హేల్స్-బట్లర్(170*-ఇంగ్లండ్), రొస్సో-డికాక్(168-దక్షిణాఫ్రికా), సంగక్కర-జయవర్ధనే(166-శ్రీలంక), గుర్బాజ్-జర్దాన్(154-అఫ్గానిస్థాన్) ఉన్నారు.