News March 24, 2026

మిర్యాలగూడ: తండ్రి ముందే కొడుకు మృతి

image

జ్వరంతో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్న చరణ్ అనే బాలుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. దామరచర్ల మండలం బెట్టెతండాకు చెందిన బాలుడు తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, మిర్యాలగూడ హైవే అగ్రిగోల్డ్ కాలనీ వద్ద ధాన్యం ట్రాక్టర్ ఇంజిన్ తగిలింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, బాలుడిపై నుంచి టైరు వెళ్లడంతో మృతి చెందాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో తండ్రి రోదనలు మిన్నంటాయి.

Similar News

News April 5, 2026

SRH Vs LSG: పిచ్ రిపోర్ట్ ఇదే..

image

నేడు ఉప్పల్‌లో SRH, LSG మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హోమ్ గ్రౌండ్‌లో విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఫ్లాట్ ట్రాక్, ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్, చిన్న బౌండరీల వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బాల్‌తో ఫాస్ట్ బౌలర్లకు కలిసి రావొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 220-230 పరుగుల టార్గెట్‌ను ఫిక్స్ చేయొచ్చని అంచనా.

News April 5, 2026

ఖమ్మం: అధికారులకు ‘వెలుగుమట్ల’ సెగ..!

image

వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోర్టు ఆదేశాలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు చిక్కుకుపోయారు. ఇటీవల కూల్చివేతల రోజే RDO బదిలీ కావడం, తాజాగా అర్బన్‌ MRO బదిలీతో వ్యవహారం ముదిరింది. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించినా, అర్హుల జాబితాలో అక్రమాలపై విమర్శలొస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి సైతం బదిలీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News April 5, 2026

ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

image

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.