News July 19, 2024

మిర్యాలగూడ బాలుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం

image

మిర్యాలగూడకు చెందిన ఓరుగంటి పవన్ కుమార్, రూప రేణుక దంపతుల కుమారుడు ఓరుగంటి రేయాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. రేయాన్ష్ పలు దేశాలు, జంతువులు, పక్షులు, గ్రహాల పేర్లు, జనరల్ నాలెడ్జ్, జాతీయ చిహ్నాల పేర్లను 15 నిమిషాల్లో 150కు పైగా చెప్పాడు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ లభించింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రేయాన్ష్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు.

Similar News

News August 26, 2025

NLG: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత ఉండొద్దు: కలెక్టర్‌

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర సామాగ్రి కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పీడీని దీనికి నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక ట్యాక్స్ నిధులు పంచాయతీరాజ్ శాఖ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

NLG: రూ.50 కోట్లకు పైగా బకాయిలు..!

image

జిల్లాలో విద్యార్థులకు చదువులు భారంగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా విద్యార్థుల బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ వంటి కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రూ.50 కోట్లకు పైగానే బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలు చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు.

News August 25, 2025

NLG: జూనియర్లకు ఎఫ్ఆర్ఎస్.!

image

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 31 కళాశాలలో ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేస్తున్నారు.