News January 8, 2026

మిర్యాలగూడ మహిళపై అత్యాచారం

image

భూమి పంచాయితీ పరిష్కరిస్తానని నమ్మించి ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. MLGకు చెందిన బాధిత మహిళ తన భూ సమస్యపై మునుగోడుకు చెందిన వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమెను దుప్పలపల్లి వద్ద ఉన్న ఎఫ్.సి.ఐ గోదాముల వెనుకకు తీసుకెళ్లి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 16, 2026

సిరిసిల్లలో పండగపూట విషాదం

image

పండుగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది. కోనరావుపేట మండలంలోని ధర్మారానికి చెందిన మల్లబోయిన మహేశ్ (34) అనే యువకుడు మత్స్యకారుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన బైక్‌పై కోనరావుపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా నిజామాబాద్‌ ఎల్లమ్మ ఆలయం మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో బురదలో కూరుకుపోయిన మహేశ్ శ్వాస ఆడక మృతిచెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు కుటుంబీకులకు సమాచారం అందించారు.

News February 16, 2026

NZB: డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్?

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా మహిళనే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇందు కోసం MIM నుంచి 54వ డివిజన్ కార్పోరేటర్‌గా ఎన్నికైన సల్మా తహసీన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె భర్త మహ్మద్ షకీల్ అహ్మద్ ఫజిల్ ప్రస్తుతం నిజామాబాద్ MIM టౌన్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. గత పాలక వర్గంలో MIMకు చెందిన ఇద్రీస్ ఖాన్ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.

News February 16, 2026

వీరు ఉపవాసం చెయ్యకూడదు

image

ఉపవాసం మంచిదే కొందరికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు, BP, కొరోన‌రీ ఆర్ట‌రీ, అరిథ్మియా స‌మ‌స్య‌లున్న‌వారు ఉప‌వాసం చేస్తే చ‌క్కెర స్థాయిలు, ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తుల్య‌త‌, నీటి శాతం త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బీటా బ్లాక‌ర్స్, యాంటీ అరిథ‌మిక్స్, బ్ల‌డ్ థిన్న‌ర్స్ మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట స‌మ‌యంలో మందుల‌ను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.