News October 28, 2025

మిర్యాలగూడ: లక్కీ డ్రాలో మృతుడికి అవకాశం

image

మద్యం టెండర్ల లక్కీడ్రాలో ఓ మృతుడికి అవకాశం దక్కింది. ఈ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. MLGలోని మద్యం షాపు(63)నకు గోపులాపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్(38) ఈనెల18న టెండరు దరఖాస్తు సమర్పించి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. నిబంధనల ప్రకారం మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు తెలిసింది.

Similar News

News October 28, 2025

MBNR: ఓపెన్ వర్సిటీ.. NOV 13 వరకే లాస్ట్

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2019-24 డిగ్రీ(BA/B.COM/BSC-2,3rd Year) ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు NOV 13 వరకు అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా ఓపెన్ వర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ G.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. 2022-2024 PG(MA/ M.COM/ MSC) అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.

News October 28, 2025

సిరిసిల్ల: ‘గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి’

image

గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రైస్, జిన్నింగ్ మిల్లర్లు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News October 28, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: కత్తితో యువకుడి హాల్ చల్.. దేహ శుద్ధి
> ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేసేది పోలీసులే: కలెక్టర్
> టీఆర్పీ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా మౌనిక యాదవ్
> రబి సాగు సాఫీగా అవ్వాలి: కలెక్టర్
> జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించిన యశస్విని రెడ్డి
> 10 రోజులపాటు జనగామలోని బతుకమ్మ కుంట బంద్
> జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్
> అధికారులతో ఎమ్మెల్యే కడియం సమీక్ష