News April 5, 2025
మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌కు నిర్వాసితుల సత్కారం

దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో భూనిర్వాసితులైన 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు జెన్కో అందజేసింది. కాగా భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జెన్కో, ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ విషయమై 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు అందజేశారు. సబ్ కలెక్టర్ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడలో ఆయనను సన్మానించారు.
Similar News
News April 6, 2025
నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.
News April 6, 2025
నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
News April 6, 2025
మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.