News February 17, 2026
మిర్యాలగూడ: GOVT జాబ్ వదిలినా దక్కని ఛైర్‌పర్సన్ పదవి..!

కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో 17వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర అనుచరులుగా పేరు ఉంది. కాగా ఉద్యోగం వదిలేయడంతో ఛైర్‌పర్సన్ పదవి తనకే అనుకున్నారు. కానీ తనకు రాకపోవడంతో బాధతో వెనుదిరిగారు.
Similar News
News February 17, 2026
MBNR: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు MBNRఎస్సీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఐదు నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి 900 గంటల నాణ్యమైన బోధన, రూ. 2500 విలువైన మెటీరియల్, పర్సనల్ అలవెన్స్ అందజేస్తామన్నారు.
News February 17, 2026
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.
News February 17, 2026
BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.


