News March 2, 2025
మిర్యాలగూడ: GREAT.. మెడికల్ కాలేజీకి పార్థివదేహం అందజేత

కొందరు అవయవ దానం చేస్తే మరికొందరు నేత్ర దానం చేస్తారు. వాటి కంటే మిన్నగా మిర్యాలగూడకు చెందిన రేపాలలక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు మెడికల్ కళాశాలకు అతడి పార్థివదేహాన్ని అందజేశారు. తమ తండ్రి చివరి కోరిక కావడంతో శనివారం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అందజేశారు. మరణంలోనూ తమ తండ్రి జీవించి ఉండాలనే ఆలోచనతోనే ఇలా చేశామని తెలిపారు.
Similar News
News March 2, 2025
పెద్ద కాపర్తి యాక్సిడెంట్‌లో నల్గొండ యువకులు మృతి

చిట్యాల మండలం <<15626572>>పెద్దకాపర్తిలో <<>>జరిగిన ప్రమాదంలో నల్గొండకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలు.. నల్గొండ మాన్యంచెల్కకు చెందిన నవాజ్, సోహైల్, సల్మాన్, షోయబ్ వెల్డింగ్ పని చేస్తారు. హైదరాబాద్‌లో వెల్డింగ్ పని ముగించుకొని వస్తుండగా ముందు ఉన్న బస్ సడన్‌గా ఆగడంతో కారు బస్ కిందికి దూసుకుపోయింది. దీంతో నవాజ్, సోహైల్ స్పాట్‌లోనే చనిపోయారు. సల్మాన్, షోయబ్ చికిత్స పొందుతున్నారు.
News March 2, 2025
BREAKING: చిట్యాలలో ఘోర ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొనడంతో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు.. బస్సు కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 2, 2025
దేవరకొండ: భార్యభర్తల మధ్య గొడవ.. ఒకరు మృతి

భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముదిగొండలో జరిగింది. సీఐ నరసింహులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తెం లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులు మద్యం తాగుతూ అప్పుడప్పుడు గొడవ పడుతుండేవారని, శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా మద్యం సేవించి గొడవపడడంతో ఆ గొడవలో భర్త లక్ష్మయ్య భార్యను నెట్టేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.