News December 10, 2025
మిల్లర్లులకు అదనంగా ధాన్యం ఇవ్వద్దు: సబ్ కలెక్టర్

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. మంగళవారం ఆయన వీరఘట్టం మండలంలోని తిధిమి గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడి మిల్లర్లకు అదనంగా ధాన్యం ఇవ్వద్దని సూచించారు. ఎవరైనా అదనంగా ధాన్యం అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు .అనంతరం గ్రామంలో ఉన్న రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Similar News
News December 18, 2025
20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
News December 18, 2025
ఎలక్షన్ అబ్జర్వర్‌కు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సన్మానం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ కాళీచరణ్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో అబ్జర్వర్ పాత్రను వారు కొనియాడారు.
News December 18, 2025
సిబ్బంది పనితీరు అద్భుతం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసి, ఎన్నికలను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


