News October 10, 2024
మిల్లెట్స్‌తో రతన్ టాటా చిత్రపటం

దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.
Similar News
News April 5, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 5, 2026
విశాఖ: తొమ్మిదేళ్లలో మూడుసార్లు వార్డులు పెంపు(2/2)

రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో గత తొమ్మిదేళ్లలో వార్డుల సంఖ్య పెంపు మూడోసారి చేపడుతున్నారు. 2017కి ముందు 72 వార్డులు ఉండగా, 2017లో 81కు, 2020లో పరిసర గ్రామాల విలీనంతో 98కు పెరిగాయి. ప్రస్తుతం 98 నుంచి 120కు పైగా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ముందుగా 8 జోన్లుగా ఉన్న జీవీఎంసీని ఇప్పటికే 10 జోన్లుగా విభజించారు.
News April 5, 2026
విశాఖ: గ్రేటర్‌లో వార్డుల పెంపు ప్రక్రియ వేగం(1/2)

జీవీఎంసీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం అందుకుంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 120కు పైగా పెంచనున్నారు. 15 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో 120 వార్డులు తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం10 జోన్లుగా విస్తరించిన జీవీఎంసీ జనాభా 23-25 లక్షల వరకు చేరింది. రానున్న మున్సిపల్ ఎన్నికలు 120 వార్డుల ఆధారంగా నిర్వహించే అవకాశం ఉంది.


