News March 22, 2025
మిషన్ వాత్సల్య పథకానికి అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News March 23, 2025
వర్ష బాధిత రైతులకు రేపు జగన్ పరామర్శ

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అవుతారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 23, 2025
హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
News March 23, 2025
చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.