News March 2, 2026
మిస్టరీ విలేజ్.. రాత్రికి రాత్రే అంతా ఖాళీ!

రాజస్థాన్‌లోని కుల్ధారా ఒక మిస్టరీ గ్రామం. సుమారు 200 ఏళ్ల క్రితం జైసల్మేర్ పాలివాల్ బ్రాహ్మణులు నివసించే ఈ గ్రామం రాత్రికి రాత్రే నిర్మానుష్యమైంది. దుర్మార్గపు మంత్రి సలీం సింగ్ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఊరిని వదిలివెళ్తూ అది ఎప్పటికీ నివాసయోగ్యం కాకూడదని శపించారట. ఇప్పటికీ ఇది ఒక ‘ఘోస్ట్ విలేజ్’గా పర్యాటకులను భయపెడుతోంది. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
Similar News
News March 6, 2026
మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>> ధరలు ఇవాళ రెండోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ మొత్తం రూ.1,750 దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రా. బంగారం రూ.1,61,130గా ఉంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,600 తగ్గి రూ.1,47,700 పలుకుతోంది. కేజీ వెండి రేటు రూ.2.90 లక్షలుగా ఉంది.
News March 6, 2026
మరోసారి బొత్సకు అస్వస్థత

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.


