News January 22, 2026
మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో లేను: మియా ఖలీఫా

మిస్టర్ బీన్ నటుడు రోవాన్ ఆట్కిన్సన్‌తో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్‌లో ఉన్నారని, వీరు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఓ వార్త SMలో వైరలైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూయడంతో మియా స్పందించారు. ‘నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను. కానీ అది మిస్టర్ బీన్ కాదు’ అని ఆమె X వేదికగా క్లారిటీ ఇచ్చారు. 71ఏళ్ల రోవాన్ ఆట్కిన్సన్ ప్రస్తుతం లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
Similar News
News April 1, 2026
నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఈరోజు నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. దీంతో HYDలో ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో 40%గా ఉన్న HRA 50%కు పెరగనుంది. ఇకపై HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50వేలు మించితే TDS వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి ₹9వేలకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5వేల నుంచి ₹15వేలకు పెరగనుంది.
News April 1, 2026
జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.
News April 1, 2026
లక్నో ఈసారి రాణిస్తుందా?

IPL: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైన LSG ఈసారి సమష్టి ప్రదర్శనతో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ నేతృత్వంలోని DC మీదా అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


