News February 23, 2025

మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

image

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Similar News

News February 23, 2025

ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

image

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News February 23, 2025

విశాఖలో పగడ్బందీగా గ్రూప్-2 పరీక్ష: కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని 16 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సెషన్స్‌లో 11,030 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 9,293 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,638 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

News February 23, 2025

గాజువాకలో యువకుడు సూసైడ్?

image

గాజువాక సమీపంలో గల అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. విశాఖ డైరీ సర్వీస్ రోడ్డులోని శ్రావణి షిప్పింగ్ భవనం పక్కనే చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉంది. ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తున మృతుడు కర్రీ ప్రవీణ్‌(27)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!