News February 28, 2026

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

image

అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో UAEపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది. ఈక్రమంలోనే దుబాయ్‌పైనా దాడులు చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నుంచి అధికారులను ఖాళీ చేయించారు. ఇరాన్ దాడి చేస్తోందన్న సమాచారంతో సైరన్లు మోగించి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూతపడింది.

Similar News

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు.. ఆయన బాడీ దొరికింది: ఇజ్రాయెల్ అధికారి

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ఇజ్రాయెల్ అధికారి ధ్రువీకరించినట్లు రైటర్స్ సంస్థ వెల్లడించింది. ఆయన బాడీని కూడా గుర్తించినట్లు ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఆధారాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు అధికారులు చూపించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. కాగా ఖమేనీ క్షేమంగానే ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతూ వస్తోంది.

News March 1, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 1)

image

* 1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1951: బిహారీ సీఎం నితీశ్ కుమార్ జననం (ఫొటోలో)
* 1955: తెలుగు భాషావేత్త వెలమల సిమ్మన్న జననం
* 1986: సింగర్ ఎన్.సీ.కారుణ్య జననం
* 1989: మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మరణం
* ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
* జీరో డిస్క్రిమినేషన్ డే

News March 1, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.