News December 16, 2025

‘మిస్‌ ఆంధ్ర’ రన్నరప్‌గా అమలాపురం కమిషనర్ కుమార్తె

image

అమలాపురం మున్సిపల్ కమిషనర్ కుమార్తె వడాలశెట్టి కోమల సాయి అక్షయ ‘మిస్‌ ఆంధ్ర’ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడలో ఈనెల 12న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అందాల పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించినట్లు కమిషనర్ సోమవారం తెలిపారు. అక్షయ ప్రస్తుతం బీబీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌లో ఎంపికై, తుది పోటీల్లో సత్తా చాటిన అక్షయను పలువురు అభినందించారు.

Similar News

News December 20, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)లో 7 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. సీనియర్ ఇంజినీర్ పోస్టుకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News December 20, 2025

SVU: ప్రొఫెసర్ కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారు..?

image

తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ విచారణ నుంచి బయట పడ్డ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారని ప్రచారం జరుగుతోంది. సైకాలజీ విభాగంలో సిబ్బంది తక్కువ ఉండడంతో తీసుకున్నారంటూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడవక ముందే.. కేసు విచారణలో ఉండగా ఆయనను తీసుకోవడం పై విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

News December 20, 2025

సంగారెడ్డి: నూతన సర్పంచ్‌లు.. ముందు ఎన్నో సవాళ్లు!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 22న నూతన సర్పంచ్‌లు పాలక పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెండేళ్లుగా గ్రామాల్లో సర్పంచ్‌లు లేక ప్రధాన సమస్యలు తిష్ట వేశాయి. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, వీధి దీపాలు, సమావేశాలు, మురికి కాలువలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాలను ప్రగతిపథంలో నడిపే ఎన్నో సవాళ్లు వారి ముందుకు రానున్నాయి.