News March 21, 2025
‘మిస్ తెలుగు USA-2025’ పోటీలో ఖమ్మం యువతి

తెలుగుభాష గొప్పతనం, సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు నిర్వహిస్తున్న ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఖమ్మం జిల్లా యువతి ఫైనల్‌కు చేరి జిల్లా కీర్తిని ఎగరేసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన హెచ్ఎం పిల్లలమర్రి శివ నర్సింహారావు కుమార్తె గీతిక ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఫైనలిస్టుగా చేరి అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు.
Similar News
News March 28, 2025
నేడు, రేపు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారాలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే ఇఫ్తార్ విందు, పలు డివిజన్లలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఖమ్మం పట్టణంతో పాటు రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు.
News March 27, 2025
ఆర్టీసీ కార్మికుల సేవలు భేష్: ఖమ్మం కలెక్టర్

ప్రజల జీవన వ్యవస్థ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కొనియాడారు. ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, ప్రస్తుత వేసవిలో వారికి ఉపయోగపడే విధంగా జిల్లా యంత్రాంగం తరుఫున 650 బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
News March 27, 2025
ఖమ్మం: మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి: కలెక్టర్

సాధారణ మాల్స్‌లా కాకుండా మహిళా మార్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్‌లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు.