News August 2, 2024

మిస్ యూనివర్స్-ఇండియాకు ఎంపికైన యువతికి సీఎం అభినందన

image

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం (M), ఎం.కె.పురానికు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు.

Similar News

News November 29, 2024

ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా

image

ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.

News November 29, 2024

చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 29, 2024

నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

image

నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.